Take a fresh look at your lifestyle.

జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు.

 

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం మురళి పదవీ విరమణ కార్యక్రమం సోమవారం వెలమ సంఘం ఫంక్షన్ హాల్‌లో జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్త శ్రీధర్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సదానందం గౌడ్ మాట్లాడుతూ, మురళి విద్యారంగానికి, సంఘానికి చేసిన సేవలను ప్రశంసించారు.

సంఘం చేపట్టిన పోరాటాలను కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్లు సకాలంలో అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విద్యారంగ అభివృద్ధికి ప్రతి నెల రూ.5 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సంగం మురళిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి జె. గజేందర్, పూర్వ అధ్యక్షులు ఎం. పర్వత్ రెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు వై. కరుణాకర్ రెడ్డి, పోల్ రెడ్డి, కే. రమేశ్, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎం. సుదర్శన్, సంఘ ప్రతినిధులు పోకల సతీష్, మధుసూదన్ రెడ్డి, బాలస్వామి, నరసింహ, ప్రభాకర్, సత్యనారాయణ, ఈశ్వర్, రమేష్, రఘురాం రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సురేష్, సుజాత, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

అలాగే వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, హరి ప్రసాద్, మహబూబ్‌నగర్ బాధ్యులు నరసింహ గౌడ్, గద్వాల బాధ్యులు లక్ష్మణ్, వివిధ సంఘాల బాధ్యులు రాజారెడ్డి, జె. శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, ధర్మరాజు, రమేష్, నిరంజన్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.