ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి పట్టణంలో 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఆయన జన్మదినం సందర్భంగా పిఆర్ఆర్ యువ సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బృందావనం కాలనీలోని ధ్రువ హాస్పిటల్ వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని పిఆర్ఆర్ యువ సేన సభ్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ దశరధ్ రెడ్డి పాల్గొని పొన్న రాజేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ,అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా యువకులు తనకు అండగా నిలిచి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.యువత సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునే అవకాశం ఉండేది కాదని అన్నారు.తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో మల్లేశం,కిష్టారెడ్డి,రాజమలరెడ్డి, మోహన్,అశోక్,దామోదర్ , అజ్గర్,గిరి,ఇంతియాజ్, దేవేందర్,మహేష్, సందీప్ ,శ్రీనివాస్,సతీష్, ప్రకాష్,సంతోష్ రెడ్డి,అశోక్,మధు , నరేష్,దస్తగిరి,నిఖిల్,వరుణ్ , శేఖర్,కిరణ్,నరసింహరెడ్డి , కొమురయ్య ,పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.