గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కడ మల్లేష్ దుబాయిలో బ్యాంక్ ఖాతాలో అక్రమ డబ్బులు బదిలీ కేసులో చిక్కుకున్న తన భర్తను ఇంటికి రప్పించాలని కోరుతూ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ ప్రజావాణి హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి లో మంగళవారం ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కి మల్లేష్ బార్య సరిత, తల్లి భూమక్క పిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ తన భర్త మల్లేష్ ఎలాంటి నేరం చేయకున్నా దుబాయ్ లో అక్రమంగా కేసు నమోదు చేశారని తొమ్మిది వేల తొమ్మిది వందల దరమ్స్ డబ్బులు చెల్లించటంతో పాటు కోర్టు జైలు శిక్ష ఆయనకు ఖరారు చేసిందని కూలీ పని చేసుకునే తమ వద్ద అంత డబ్బు లేదని ఐదు నెలలుగా పని లేకపోవడంతో తినటానికి తిండి లేక ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నాడని ఇంటి వద్ద పిల్లలు నాన్నా అని ఏడుస్తున్నారని ప్రభుత్వం ఆదుకుని తన భర్తను ఇంటికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.