- భారీగా స్తంభించిన ట్రాఫిక్.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేఖరి: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రోజు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం నుండి నీరు విడుదల చేయకపోవడంతో వరద కాలువలోకి నీరు రాలేదని, ఎస్సారెస్పీ వరద కాలువను నమ్ముకొని రైతులు పంటలు సాగు చేస్తున్న నీరు లేకపోవటంతో పంటలు వేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రహదారి పై బైఠాయించారు. వర్షాభావ పరిస్థితులతో వరద కాలువలో నీరు లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే కాళేశ్వరం నుండి నీటిని విడుదల చేసి వరద కాలువ లోకి నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రైతు ధర్నాకు బీఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రోడుపై సుమారు గంటపాటు దర్నా నిర్వహించగా ఎక్కడి వాహానాలు అక్కడే నిలిచిపోయాయి. ఆందొళన నిరసన తెలిపేందుకు వంటావార్పు నిర్వహించేందుకు ధర్నాలో పాల్గొన్న రైతుల నుండి విరాళాలు సేకరించి వంటావార్పుతో నిరసన తెలిపే ప్రయత్నంలో పోలీసులు వంట వార్పుని నిలుపుదల చేశారు. తక్షణమే కాలేశ్వరం నీరును ఎస్సారెస్పీ వరద కాలువలో నింపాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోరుట్ల ఆర్డిఓ జీవాకర్ ఫోన్లో మాట్లాడి ఈనెల 24 తారీకు వరకు వరద కాలువలో నీరు నింపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.అనంతరం స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించారు.ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మార్క్సైడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, పిడుగు ఆనంద్ రెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, కంటే సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
