ముద్ర మల్కాజిగిరి:
మల్కాజిగిరి పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ సందర్భంగా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 118 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులు పట్టుబడ్డారు. వాహనాల వారీగా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
రెండు చక్రాల వాహనాలు: 96
మూడు చక్రాల వాహనాలు: 4
నాలుగు చక్రాల వాహనాలు: 18
పట్టుబడిన వారందరినీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం ఒక తీవ్రమైన నేరమని మల్కాజ్గిరి పోలీసులు హెచ్చరించారు,గత వారం 22తేది నుంచి 28 వరకు కేసుల పరిష్కారం,
మొత్తం 492 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చాయి.
30 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష
7 మందికి జరిమానా + సామాజిక సేవ
455 మందికి జరిమానా మాత్రమే విధించబడింది
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు – మద్యం సేవించి వాహనం నడపవద్దు, మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడండి.