Take a fresh look at your lifestyle.

దశల వారీగా గ్రామాల అభివృద్ధికి కృషి… ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

మంచాలలో రూ. 4.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: దశలవారీగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం ఆగపల్లి, కాగజ్ ఘాట్, జాపాల, అస్మత్ పూర్ గ్రామాల్లో సుమారు రూ. 4.72 కోట్ల వ్యయంతో బిటీ రోడ్లు, సీసీ రోడ్లు, మైనారిటీ కమ్యూనిటీ హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు తెలిపారు. గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ప్రేమకర్ రెడ్డి, వాజీద్, వింజమూరి రాంరెడ్డి, ఎడమ నరేందర్ రెడ్డి, రాజశేఖర్ రావు, రామకృష్ణ, జయమ్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలి 

నిరుపేదల పాలిట సీఎంఆర్ఎఫ్ వారంలాంటిదని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. మంచాల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ. 12.69 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మెరుగైన కార్పొరేట్ వైద్యం పొందేందుకు సీఎంఆర్ఎఫ్బ్దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆపదలో ఆసుపత్రిలో చేరిన వారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.