మాదాపూర్, ముద్ర విలేఖరి: గురుపౌర్ణమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్, స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ సాయిబాబా టెంపుల్ లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్.ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కొండపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలియజేశారు. గురుపౌర్ణమి పండుగ వేడుకల్లో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముదిరాజ్, సీనియర్ నాయకులు శుద్ధపల్లి విజయ కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, కొల్లూరి, మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, అజయ్, సత్యేందర్ సింగ్ సంతోష్ కుమార్, రాజేష్ యాదవ్, మురళి మోహన్, రాజేష్ యాదవ్, కచ్చావా దీపక్ తదితరులు పాల్గొన్నారు.