బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు
ఫేక్ కాల్‌గా నిర్ధారణ
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి బెదిరింపు రాగా అధికారులు దాన్ని ఫేక్ కాల్‌గా తేల్చారు. తాజాగా మరోసారి ఫోన్ రావడంతో పోలీసులు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. రెండ్రోజుల క్రితం కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు మెయిల్ రాగా ఆ బెదిరింపులకు పాల్పడింది తమిళనాడుకు చెందిన పోలీసులని స్ధానిక పోలీసులు గుర్తించారు. కాగా శుక్రవారం వచ్చిన మెయిల్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మెయిల్ ఎవరు పంపారు ? ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.