Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, వీటిలో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.

వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో, అతివేగంగా లేదా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. చిన్న తప్పిదం కూడా కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తుందని చెప్పారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం వంటి విషయాలను గుర్తు చేయాలని సూచించారు. అలాగే మైనర్ డ్రైవింగ్ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవో అధికారి రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కళ్యాణ్, కల్వకుర్తి సబ్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.