Take a fresh look at your lifestyle.

కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలి -ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టి రాణించాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి అన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వేడుకలు 2026-27 లక్ష్యాలపై బ్రాంచ్ మేనేజర్ మూర్తి దిశానిర్దేశం చేశారు.
నూతన ఆర్థిక సంవత్సరాన్ని 2026-27 పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ పట్టణంలోని కార్యాలయంలో బుధవారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఏజెంట్ అధిక సంఖ్యలో పాలసీలు చేసి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఏ ఓ బీసన్న, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు. రమణ రావు , చెన్నయ్య, భాస్కర్ గౌడ్, అసిస్టెంట్ కృష్ణయ్య, ఆఫీసు సబ్ స్టాఫ్ నాగార్జున, రఖీబ్, ఏజెంట్స్ వెంకటస్వామి, సుఖజీవన్ రెడ్డి,శ్రీనివాసులు ,వీరాచారి, బాల్ రెడ్డి,సిబ్బంది,ఏజెంట్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.