ముద్ర మల్కాజిగిరి:
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కొత్త కార్యవర్గం శుక్రవారం ప్రొఫెసర్ కోదండరాం ను మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పలు ముఖ్య విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర టీయూఎఫ్ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన ఓరుగంటి ఆనంద్ ని కోదండరాం అభినందించి శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మీడియా ఇన్ఛార్జ్ తాడూరి గగన్ కుమార్, రాష్ట్ర నాయకురాలు జానకి రెడ్డి, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ , కార్యనిర్వాహక కార్యదర్శి నరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీ తెలంగాణ ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.