- జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: వీధి వ్యాపారులు సౌలభ్యర్ధం వెండిoగ్ జోన్లు గుర్తించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసి) జె.అరుణ శ్రీ అన్నారు.రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం టౌన్ వెండిoగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం నగర పాలక సంస్థ లో నూతన గ్రామాలు విలీనమైన నేపధ్యంలో మెప్మా,పట్టణ ప్రణాళికా విభాగం,ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్తంగా సర్వే చేసి చేసి అరవై డివిజన్ల వారీగా రెడ్,గ్రీన్, అంబర్ వెండిoగ్ జోన్లు గుర్తించాలని అన్నారు.గుర్తించిన జోన్ లలోనే వీధి వ్యాపారులు విక్రయాలు జరిగేలా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.వీధి వ్యాపారుల సౌకర్యార్ధం కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.అలాగే ప్రభుత్వం కల్పించే భీమా పథకాల లో వారిని భాగస్వాములను చేయాలని అన్నారు.వీధి వ్యాపారుల జాబితాలో అనర్హుల ను గుర్తించి తొలగించడంతో పాటు అర్హులను చేర్చాలని అన్నారు.మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన వీధి వ్యాపారులు పడకుండా బ్యాంకుల సహకారం తో పి ఎం స్వనిధి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి,ఎ సి పి శ్రీహరి,టి పి ఓ నవీన్,ఆర్.ఓ ఆంజనేయులు, ట్రాఫిక్ సి ఐ బి. రాజేశ్వర్ రావు ,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సి హెచ్ వెంకటేశ్,మెప్మా టి ఎం సి మౌనిక సి ఓ లు ఊర్మిళ, ప్రియదర్శిని,శమంత,రామగుండం పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నూనె లతా మోహన్,వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.స్వశక్తిమహిళలు, ఆర్ పి లు,మున్సిపల్ సిబ్బంది కలిసి గాంధీ చౌరస్తా వద్ద మానవ హారం నిర్వహించారు. మార్కండేయ కాలనీ లక్ష్మీ పురం, ఎం ఆర్ ఓ కార్యాలయం వద్ద పిచ్చి చెట్లు,పొదలుతొలగించారు. ఎయిట్ ఇంక్ లైన్ కాలనీ లో స్థానికులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై,వీధి వ్యాపారుల కు పి ఎం స్వనిధి,తదితరపథకాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో సానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్,నాగ భూషణం, కుమార స్వామి,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్,ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ , సూపర్వైజర్లు, మెప్మా సి ఓ లు ఊర్మిళ,ప్రియ దర్శిని,ఆర్ పి లు పాల్గొన్నారు.రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాల కు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసి) జె.అరుణ శ్రీ తెలిపారు.యజమానులు రోడ్లపై తిరుగుతున్న తమ పశువులను మూడు రోజుల్లోగా తరలించుకు పోవాలని ఆమె కోరారు.