రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి: స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దిగువ రైలు ఢీ కొని ఒకరు మృతి చెందినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. వారు తెలిసిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి తమ బంధువులతో కలిసి కాజీపేట నుంచి రవీంద్రఖనికి భాగ్యనగర్ రైలులో వచ్చిన మహమ్మద్ మోహర్ నిషా బేగం రైలు దిగి వస్తున్న క్రమంలో ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జి.ఆర్.పి ఎస్సై మహేందర్ తెలిపారు.