Take a fresh look at your lifestyle.

పల్లెల అభివృద్ధికి రూ. 387.53 కోట్లు విడుదల

15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రిలీజ్
రూ. 1034.42 కోట్లకు చేరిన ఫండ్స్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. శుక్రవారం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటి వరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి. కేంద్రం నుంచి దశల వారీగా విడుదలైన నిధులలోనుంచి తెలంగాణ ఆర్థిక శాఖ గ్రామ పంచాయతీలకు రూ. 256 కోట్లను విడుదల చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా పెండింగ్ లో 200 కోట్లు:
దాదాపు రెండేళ్ల ఏళ్ల పాటు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.గతేడాది డిసెంబర్ లో రాష్ట్రంలోని పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో కేంద్రం నుంచి నిధులు విడుదలవుతుండగా వాటిని క్రమంగా రాష్ట్రం పంచాయతీలకు విడుదల చేస్తోంది. కాగా తెలంగాణకు కేంద్రం ఇంక రూ.2వేల కోట్లు బాకీ ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్ర విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.