కర్ల రాజేష్ మృతికి కారకుడైన ఎస్సై సురేష్ రెడ్డి సస్పెండ్ అయ్యేంతవరకు పోరాటం ఆగదు,
వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు చిలుకూరు మండల ఇంచార్జ్,
చిలుకూరు, ముద్ర : కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడైన చిలుకూరి ఎస్సై సురేష్ రెడ్డి సస్పెండ్ అయ్యేంతవరకు పోరాటం ఆగదని ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ స్పష్టం చేశారు. చిలుకూరు మండల పరిధిలోని మాధవ్ గూడెంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చిలక నాగరాజు మాదిగ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, కర్ల రాజేష్ మరణించి ఇప్పటికీ రెండు నెలలు దాటిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గాని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గాని రాజేష్ మృతి పట్ల కనీస స్పందన లేకుండా ఉండటం అనేది సరైనది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ మేఘాల మీద సిఐని సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం గాని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గాని మంత్రి కుమార్ రెడ్డి గాని ఎస్సై సురేష్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇదే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ఎందుకు స్పందించటం లేదని నిలదీసిన ఆయన ఈ రోజున కర్ల రాజేష్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాడో వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా శాఖ పరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19వ తేదీన, చిలుకూరు మండల కేంద్రంలో కర్ల రాజేష్ మాదిగ సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని, చిలుకూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సంతాప సభను విజయవంతం చేయాలని,ఈ సభలొ పద్మశ్రీ అవార్డు గ్రహీత మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడతారని ఆనందరావు మాదిగ తెలియజేశారు. ఈ గ్రామ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు మాతంగి వీరస్వామి మాదిగ, మరియు గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ బాధ్యులు మాదిగ పెద్దలు మాదిగ మహిళలు యువకులు మాదాసు గోపి , రాంపండు రామారావు, మాదాసు ఆదినారాయణ, జగ్గంపల్లి బాబు రెడపంగు సుజాత, మాదాసు లక్ష్మి, చిలుక కవిత, మాదాసు వెంకటమ్మ, మాదాసు గురమ్మ, మాదాసు రాధ, తదితరులు పాల్గొన్నారు.