ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిని భువనగిరి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగళ్ళ పల్లి శ్రీవాణి రవికుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అవినీతికి తావివ్వకుండా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి కి కృషి చేయాలన్నారు.