ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర హామి ఇచ్చారు. మంగళవారం జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఆయనను కలువగా సానుకూలంగా స్పందించారు. తన కార్యాలయానికి రమ్మని వారితో చెప్పారు. కూర్చోని మాట్లాడుకుందామని ఆయన వారితో చెప్పారు. సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.