ముద్ర ప్రతినిధి, మెదక్:
మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంపీ రఘునందనరావుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ… తన సొంత నిధులతో బ్యాటరీ వెహికల్ ను అందిస్తామన్నారు.
ఈ డే కేర్ సెంటర్ ద్వారా మెదక్ జిల్లాలోని వయోవృద్దులు కాలక్షేపం కోసం అడుకునే ఆట సామగ్రి, వార్తా పత్రికలు, పుస్తకాలు, సరదాగా వంట చేసుకుని తినడానికి వంట సామగ్రి కూడా అందుబాటులో ఉంటుందన్నారు. వయోవృద్దులు వారి శేష జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్న వాటన్నిటిని వదిలి ఈ డే కేర్ సెంటర్ లో అందరు వయోవృద్ధులతో సంతోషంగా ఉండవచ్చని సూచించారు.
ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమానికే అధికారులందరూ పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్పర్సన్ నరేష్ గౌడ్, సేవాసంఘం స్వచ్చంద సంస్థ సతీష్, శ్రీధర్, డిసబుల్ సెక్షన్ అధికారి జింక రవీందర్, వయోవృద్ధులు పాల్గొన్నారు.