Take a fresh look at your lifestyle.

99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమమును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జాయింట్ డైరెక్టర్ త్రిల్లేశ్వర్ రావు, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, భువనగిరి మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం  పరిసరాల పరిశుభ్రత కు సంబంధించి భువనగిరి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు..
అనంతరం అందరీ తో కలిసి 8వ వార్డులో స్వయంగా చీపురు పట్టి రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తి ఇట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అన్ని వాటిల్లో విజయవంతంగా చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.