ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ధాన్యం కొనుగోళ్లు, రవాణాకు ఏర్పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా నిర్మల్ సమీపంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. టోల్ ప్లాజా మీదుగా వెళ్తున్న ఖాళీ లారీలను గుర్తించి, వాటిని ధాన్యం రవాణాకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీ డ్రైవర్లు, యజమానులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్లు సంతోష్, సరిత, శ్రీనివాస్, రెవెన్యూ, రవాణా, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.