Take a fresh look at your lifestyle.

మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్యగిరి.

ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ శాఖా గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్యగిరి ని నియమిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తీ జారీ చేసిన ఉత్తర్వుల ను తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్(మంగళవారం)హైదరాబాద్ లోని తన నివాసం లో కోమటి మత్స్యగిరికి అందజేశారు.ఈ సందర్బంగా కోమటి మత్స్యగిరి కి శుభాకాంక్షలు తెలియజేసి మోత్కూర్ శాఖా గ్రంథాలయ అభివృద్ధి కి ఎళ్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్థాననీ ఆన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తీ తొడ్పాటుతో మోత్కూర్ శాఖా గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతామన్నారు. మోత్కూర్ గ్రంథాలయ అభివృద్ధికి 12 వేల పుస్తకాల సేకరణ పది లక్షల రూపాయలతో అదనపు రీడింగ్ హాల్ ఏర్పాటు కు కృషి చేసిన మత్స్య గిరిని ఎమ్మెల్యే మందుల సామెల్ అభినందించారు. త్వరలో ప్రమాణస్వీకారోత్సవంలో జిల్లా చైర్మన్ తో పాటు పాల్గొని గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ సందర్బంగా కోమటి మత్స్యగిరి ఎమ్మెల్యే మందుల సామెలు కు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిస్తీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.