Take a fresh look at your lifestyle.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.

ముద్ర,మోత్కూరు:
ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదల ఇండ్లను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేదల సోంతింటి కళ ఇందిరమ్మ ఇండ్లతో నిజం చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికి అమలులో నీరు కారుస్తుందని విమర్శించ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉన్న నిబంధనలతో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం విధించిన నిబంధనలతో గ్రామాలలోని గ్రామ కమిటీలు కూడ ఆర్ధికంగా ఉండి ఇల్లు నిర్మించుకోగలిగిన వారికే ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. ఇల్లులేని పేదలు ఆర్థిక ఇబ్బంధులతో ఇండ్లు నిర్మించుకోలేక పోతున్నారని, ఇండ్లు లేని నిరుపేదలు సోంతింటికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశయం, పేదోళ్ల సోంతింటి కళ నెరవేరాలంటే ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో నిబంధనలు పూర్తిగా తొలగించి,ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, చింతకింది సోమరాజు, సైదులు, బరిగేల నారాయణ, ముక్కిడి నర్సింహా, బరిగేల సూర్యనారాయణ, ముక్కాముల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.