Take a fresh look at your lifestyle.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..  దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో హెల్మెట్ పంపిణీ.

 

ముద్ర, యాదగిరిగుట్ట :

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.  యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరైవ్ ఆలైవ్  రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. అనంతరం  మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

“ప్రాణం విలువైనది కుటుంబానికి మీరు అవసరం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. యువత ముఖ్యంగా వేగానికి లోనుకాకుండా బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే హెల్మెట్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం చాలా అవసరమని చెప్పారు.అలాగే, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సైదాపురం ఉపసర్పంచ్ దుంబాల వెంకటరెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు, టౌన్ సిఐ భాస్కర్, రూలర్ సిఐ శంకర్ గౌడ్, ట్రాఫిక్ సిఐ కృష్ణ, తాసిల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీవో నవీన్ కుమార్, సర్పంచ్ రోజా దర్శన్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.