Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

 

కొనుగోలు వేగవంతం కోసం అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు

అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం

పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆకస్మికంగా తనికి చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.

ముద్ర ,తుంగతుర్తి….
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వివిధ ప్రాంతాలలోని ధాన్యం కొనుగోలు సెంటర్ల నుండి కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ధాన్యం కొనుగోలు సెంటర్ల లో ధాన్యం తూకాలను, కొనుగోళ్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి వివిధ మండలాల్లోని కొనుగోలు సెంటర్లను సందర్శిస్తున్నామని అందులో భాగంగా మంగళవారం మద్దిరాల, నూతనకల్ ,ఆత్మకూర్ ఎస్, తుంగతుర్తి మండలాల్లోని వివిధ కొనుగోలు సెంటర్లను పరిశీలించినట్లు కలెక్టర్ అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి అన్ని శాఖల వారి సమన్వయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కొనుగోలు వేగవంతంగా చేయడానికి అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలను అలాగే అదనంగా హమాలీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రోజుకు పదివేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాల్లోనీ అన్లోడింగ్ కేంద్రాల్లో అన్లోడ్ చేస్తున్నామని అన్నారు .ఇంకా వేగవంతంగా కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట తుంగతుర్తి తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష కుమార్ ఏడిఏ రమేష్ బాబు, ఎస్ఐ క్రాంతి కుమార్ ,ఏపీఎం యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.