Take a fresh look at your lifestyle.

సంక్రాంతి పండుగకు బస్సు టిక్కెట్ల ధరల్లో మార్పులు

  • మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టిక్కెట్ ధరలను పెంచనున్నారు. స్పెషల్ బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ జీవో మేరకు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను పెంచే వెసులుబాటును ఆర్టీకి ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం కేవలం 5 రోజులే టిక్కెట్ ధరలను పెంచినట్టు టీజీఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ ధరలు ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు 19, 20 తేదీల్లో అమల్లో ఉండనున్నాయి. స్పెషల్ బస్సులు మినహాయిస్తే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చని తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ www.rgsrtcbus.in లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికుల కోసం 6,432 ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణీకులు ఎక్కువ ప్రయాణం చేసే అవకాశమున్నందున.. ఈ రోజుల్లో ఎక్కువ బస్సులను నడపనుంది. పండుగ తర్వాత 19, 20 తేదీల్లోనూ తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ఏర్పాట్లు చేసింది. తెలంగాణకు సెంటర్ పాయింట్ గా ఉన్న హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ, గచ్చిబౌలి, జేపీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ముఖ్య ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రయాణీకులు ఇబ్బందులు కలగకుండా పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులో ఉంచింది.

Leave A Reply

Your email address will not be published.