Take a fresh look at your lifestyle.

వైభవంగా శ్రీస్వామివారికి లక్ష పుష్పార్చన

ముద్ర, యాదగిరిగుట్ట :

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి వివిధ రంగురంగు పూలతో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేంద్ర చార్యులు, ఉప ప్రధాన అర్చకులు శ్రీధర్చార్యులు, అనిల్ కుమార్ చార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.