నిజాంపేట్ మండల కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజల దూర భారం, విలువైన సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
సోమవారం నిజాంపేట్ మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఇందుకోసం నోడల్ అధికారులను నియనిస్తామన్నారు. నిజాంపేట ప్రజావాణిలో ప్రజల నుండి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించి, పరిష్కారం కాని వాటిని రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
భూ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కోర్టు పరిధిలో, పోలీసు పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు.
వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి, వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నిజాంపేట్ ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య అధికంగా ఉన్నందువల్ల వాటిని పరిష్కరిస్తామని, పరిష్కరించని వాటిని రాతపూర్వక సమాధానం అందిస్తారని పేర్కొన్నారు.
ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ అది తూచా తప్పకుండా ప్రజావాణి కార్యక్రమంలో హాజరవ్వాలని ఆదేశించారు.
అనంతర తహసిల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన చేశారు. స్థలంలో తహసిల్దార్ కార్యాలయం అని బోర్డు ఏర్పాటు చేయాలని, స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ శ్రీనీవాస్, ఎంపీడీవో రాజారెడ్డి మండల స్థాయి అధికారులు, రెవిన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.