Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేద వాడి కళ.. కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 12 వార్డ్ లో నూతన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం కి వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయ లక్ష్మి వెంకటేష్ యాదవ్ నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటీని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొన్ని లక్షలు మంది ఇండ్లు నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పద్మ బిక్షపతి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.