Take a fresh look at your lifestyle.

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  

జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ జన్మదిన వేడుకలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన గౌరవ కేసీఆర్ దీర్ఘాయుష్షుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. ఈ జన్మదిన వేడుకలో నాయకులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పట్టణ అధ్యక్షలు ఏవీ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు చెన్న స్వాతి మహేష్, చీమల రాజు, నాకోటి నగేష్, ఏలే భువనేశ్వరి శివ, సీనియర్ నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, కుషాంగాల రాజు, ఖాజా అజీముద్దీన్, తుమ్మల పాండు, ఇక్బాల్ చౌదరి, శాగంటి నర్సింహ, నిలగొండ శివ, గుమ్ముల మల్లేశం, ఎండి ఖాజాం, గుజ్జ పవన్, కాడరి ప్రవీణ్, చిక్క ప్రభాకర్, వాకిటి కుమార్, సురేష్ యాదవ్, మంద వెంకటేశం, సిరిపంగ సుభాష్, ముస్త్యాల ఆనంద్, ఎండి అమ్జత్, గుండెబోయిన నర్సింహ, ముదిగొండ మహేష్, ఇండ్ల శ్రీనివాస్, తుమ్మల వినోద్, మహిళా నాయకురాళ్లు రత్నాపురం పద్మ, పావని, వనజా పాల్గొన్నారు.

తాజ్పూర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

మండలంలోని తాజ్పూర్ గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు సర్పంచ్ రాకల సంతోషా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ కూడలి వద్ద కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టి సాధించాడని రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆయనని ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.