యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ లో మంగళవారం రామగుండం రెండవ ఏరియా యాజమాన్యం ఏరియా.3, ఏపీఏ ఏరియాలకు చెందిన ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహించింది. ఇప్పటివరకు క్వార్టర్ లేని వారికి, చేంజ్ ఆఫ్ క్వార్టర్ కోరుకునే రామగుండం.3వ ఏరియా, ఏపీఏ ఏరియా ఉద్యోగుల కొరకు యాజమాన్యం కౌన్సిలింగ్ ఏర్పాటు చేసింది.ఈ కౌన్సిలింగ్ లో ఖాళీగా ఉన్న 972 క్వార్టర్లకు గాను 113 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 54 మంది ఉద్యోగులు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. ఇక అందులో 33 మంది ఉద్యోగులు మాత్రమే క్వార్టర్లను తీసుకున్నారు. ఇక ఈ ఈ కౌన్సిలింగ్ నిర్వహణలో ఏరియా అఫిషియేటింగ్ ఎస్ఓ టు జీఎం ఎస్.సంతోష్ కుమార్, గుర్తింపు సంఘం ఏరియా కార్యదర్శి జి. రవీందర్, డీజీఎం పర్సనల్ అరవింద్ రావ్, అధికారులు ప్రతాపగిరి రాజు, సధన్, అజీజ్, సెక్యూరిటి అధికారి షరీఫ్ మహమ్మద్, స్పొర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి, క్వార్టర్ సెక్షన్ ఉద్యోగులు పాల్గొన్నారు.