Take a fresh look at your lifestyle.

రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తే.. ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటలో సీట్లు–ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో ఎంపీ డీకే అరుణ

 

-గ్రామీణ ప్రాంత యువతని క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యం

 

ముద్ర, నారాయణపేట :

రాష్ట్ర… జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తే.. ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటలో సీట్లు వస్తాయని…అందుకోసమని గ్రామీణ ప్రాంత యువతని క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో గురువారం జరిగిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడారంగంలో ప్రతిభ చూపేలా కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో అన్ని ఆటలను నిర్వహించడం జరుగుతుంది. మొదటి సారి నాలుగు రకాల ఆటలు మాత్రమే నిర్వహించడం జరిగిందని వచ్చే ఏడాది అన్ని రకాల ఆటలు నిర్వహించుకుందామన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన టీంలు నియోజకవర్గ స్థాయిలో ఆడుతారని… నియోజకవర్గ స్థాయిలో గెలిచిన టీమ్ లు పార్లమెంట్ స్థాయిలో ఆడుతారన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు క్రీడారంగంలో ముందుకు వెళ్లేందుకుతన వంతు సహకారం అందిస్తానన్నారు. మునిసిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యాయాదవ్, బీజేపీ పేట మండల అధ్యక్షులు జ్యోతి సాయిబన్న, పీఎం ఎస్ కేఎం పేట జిల్లా కన్వీనర్ తిరుపతి రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, కౌన్సిలర్ కమలాపూర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారాయణపేట మండలం సింగారం గ్రామంలో, ఉట్కూరు మండలం పెద్దజట్రమ్ గ్రామంలో సీసీ రోడ్లు, హై మాస్ట్ లైట్స్ లను ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు కేంద్రం నిధులతో మాత్రమే జరుగుతున్నాయన్నారు.
సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, మధ్యాహ్నం భోజనం, రేషన్ బియ్యం ఇలా అన్నింటిలో కేంద్రం వాటా ఉందన్నారు. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయక మోసం చేస్తుందని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.