Take a fresh look at your lifestyle.

అభివృద్ధికి నోచుకోని అమ్రాబాద్ మండలం

  • బిజెపి పార్టీ నాయకుల వినూత్న నిరసన.
  • అమ్రాబాద్ మెయిన్ రోడ్లు వేయాలని నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం గత దశాబ్దాల కాలం నుండి అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన నల్లమల అమ్రాబాద్ మండల కేంద్రం లో బిజెపి నాయకులు శంకుస్థాపన బోర్డు దగ్గర బైఠాయించి వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు మాట్లాడుతూ దశాబ్దాలుగా అమ్రాబాద్ మండలానికి పట్టిన గ్రహణం తొలగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని హోమ కార్యక్రమం చేయడానికి సిద్ధపడే క్రమంలో బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అన్యాయం అన్నారు. అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో అభివృద్ధిని అడ్డుకోకూడదని ఈ నల్లమల ప్రాంతం అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని ఈ ప్రాంత ప్రజల కోసం ఉద్యమం చేయడానికి ఎప్పుడు బిజెపి పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని బిజెపి తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ రెండు రోడ్డులు వేస్తా నని శంకుస్థాపన ఏర్పాటు చేశారు కానీ ఒక తట్టుడు మట్టి కూడా పోయలేదని ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింతగా దెబ్బతిన్నాయని పాదచారులు నడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉందని నాగరాజు అన్నారు ఎన్నికల కోసం కాకుండా ప్రజల బాగు కోసం ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని నాగరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గోలి రాజు, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్,OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పగిడి పాల అనిల్, బిజెపి జిల్లా నాయకులు నోముల శంకర్ గౌడ్ , నోముల పరమేష్ గౌడ్ , మాధగోని సతీష్ కుమార్ గౌడ్, ఎర్ర గిన్నెల వెంకటేష్ చారి, జంపుల క్రాంతి, నోముల రమేష్ గౌడ్, రాసమెల్ల సాయి, శంకర్ సందీప్ యాదవ్, ఉప్పల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.