Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి- ఐజేయూ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి హామీ ఎల్బీనగర్ లో జర్నలిస్టుల సన్మానం

 

ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్, మార్చి 30:

జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తానని, వారికీ అన్ని విధాలుగా అండగా ఉంటానని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జేయూ) జాతీయ ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన వై నరేందర్ రెడ్డి అన్నారు. ఐజెయూ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనా వై నరేందర్ రెడ్డి ఎల్బీనగర్ వనస్థలిపురం లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రంగారెడ్డి యూనిట్, ఎల్ బీ నగర్ నియోజకవర్గ జర్నలిస్టుల తరపున ఘనంగా సన్మనించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు, సంక్షేమానికి ఐజేయూ నిరంతరం పోరాడుతుందన్నారు.

జర్నలిస్టుల సమస్యలపై జాతీయ స్థాయిలో గళమెత్తుతామని అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గంలో రంగారెడ్డి జిల్లాకు పెద్దపీట దక్కిం దన్నారు. నరేందర్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావటం మనకు గర్వకారణామన్నారు.జిల్లా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ సలీమ్ పాషా, మేకల సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ కమిటీలో రంగారెడ్డి జిల్లాకు అత్యంత ప్రముఖమైన స్థానం కల్పించిన ఐజేయూ నాయకత్వనికి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జాతీయ కౌన్సిల్ సభ్యులకు, వివిధ రాష్టాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రవీణ్ కుమార్, శివకుమార్, జిల్లా కోశాధికారి శశిపాల్ రెడ్డి, ఆరోగ్య శిబిరం కన్వీనర్ రాచ శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్యామ్ ప్రసాద్, బెల్లిమల్లేష్ యాదవ్, సీనియర్ జర్నలిస్టులు కీసరి మల్లేష్ గౌడ్, వెంపటి గణేష్, శ్రీనివాస్, రఫీ, చంద్రశేఖర్ గౌడ్, రాజశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.