ముద్ర, కోరుట్ల;
భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడు గ్రౌండ్ లో జరిగే ప్రధాన మంత్రి మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ, ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ముఖ్య నాయకులు గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి జనసమీకరణ చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి, కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, సీనియర్ నాయకులు గాందారి శ్రీనివాస్, పిడుగు ప్రతాప్ రెడ్డి, కల్లెడ ప్రసాద్, కిషోర్, రాజేష్ పాల్గొన్నారు.