మాదాపూర్, ముద్ర విలేఖరి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా గుల్ మొహర్ పార్క్ కాలనీ వాసులు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేశారు.ఈ సందర్భంగా గుల్ మోహర్ పార్క్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో ఇటీవల సీసీ రోడ్ల కాలనీ మీ సహకారంతో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను పూర్తి చేయాలని, డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు చైర్మన్ గాంధీకీ విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గుల్ మోహర్ పార్క్ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, రోడ్డు పనులు పూర్తవడం చాలా సంతోషకరమైన విషయం అని,గుల్ మోహర్ కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, అదేవిధంగా కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లును త్వరలోనే పూర్తి చేస్తానని చైర్మన్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా కాలనీ లలో నెలకొన్న అన్ని సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని, సీసీ రోడ్ల ఏర్పాటు కు కృషి చేస్తానని, త్వరలోనే కాలనీ లలో పర్యటిస్తానని గాంధీ తెలియచేసారు. అదేవిదంగా కాలనీల లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలియచేసారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులదరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీలు తీర్చిదిద్దుతామన్నారు.ఈ కార్యక్రమంలో గుల్ మోహర్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, నాగన్న, విల్సన్, కుమార్, గంగి శెట్టి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, భాస్కర్ నాయుడు, సాగర్, కిరణ్ కుమార్,ఆడమ్, శర్మ, ముని కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.