Take a fresh look at your lifestyle.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్….

 

కథలాపూర్ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ….

ముద్ర, కోరుట్ల;
దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కథలాపూర్ మండలంలో పర్యటించిన ఆయన తండ్రియాల గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ.90 లక్షల 10 వేల విలువైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, అలాగే రూ.7 లక్షల 87 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం ఒక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నుంచి విద్యా వారోత్సవాలు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
గతంలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించి నిజమైన అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సారించిందన్నారు. ఎడమ కాలువల పరిధిలో కలికోట నుండి చింతకుంట వరకు భూసేకరణకు సంబంధించి రూ.45 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందించామని వెల్లడించారు. ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కథలాపూర్ మండల పరిధిలో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని లింక్ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు న్యావనంది శేఖర్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేగ్యారపు శ్రీహరి, సర్పంచులు ముధం రవి, కుంటాల నరేష్, కాంగ్రెస్ నాయకులు లోక నర్సారెడ్డి లతోపాటు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

దూలూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.