సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి:
అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు,బహుళ అంతస్తుల భవనాలు కాదు.హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి,స్లాబులు వేస్తే సరిపోదు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
‘‘హాస్పిటల్ అంటే పూర్తి స్థాయిలో భవనాలు ఉండాలె, వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది,ఎక్విప్‌మెంట్ సహా అన్నిరకాల సదుపాయాలు ఉంటేనే వైద్యం అందించగలుగుతాం.
కానీ,మీరు ఎన్నికలకు ముందు లబ్ది పొందడానికి అడ్డగోలుగు జీవోలు ఇచ్చారు.టీచింగ్ ఫాకల్టీ,సరియైన వసతులు, సిబ్బంది,భవనాలు లేకుండా మెడికల్ కాలేజీలు పెట్టారు. హాస్పిటళ్ల అప్‌గ్రేడెషన్ అంటూ అక్కడ కొంత, ఇక్కడ కొంత గందరగోళం చేసి ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు.
మీపదేండ్ల పాలనలో దెబ్బతిన్న ప్రజారోగ్య వ్యవస్థను మేము చక్కదిద్దుతున్నామని,
రెండు సంవత్సరాల్లో సుమారు 10 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.సుమారు మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను మరో 4 నెలల్లో పూర్తి చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి హాస్పిటల్‌లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
ప్రతి హాస్పిటల్‌ను ఆధునీకరిస్తూ,పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ క్లినిక్స్,డే కేర్ కేన్సర్ సెంటర్లు, మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేశాం. డయాలసిస్ సెంటర్ల సంఖ్య పెంచుతున్నాం. ట్రామా కేర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచాం.ఇలా పదేండ్లలో మీరు చేయలేని అనేక మంచి పనులను మేము రెండేండ్లలో చేసి చూపించాం.ఇంకా ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని వెల్లడించారు.
మా ప్రభుత్వం ఏర్పడే నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదు.
హాస్పిటల్ బిల్డింగ్ కోడ్‌ను ఉల్లంఘించి, కేవలం ప్రచార ఆర్భాటం కోసం 24 అంతస్తుల స్లాబులు వేశారు.
తొలుత 16.5 లక్షల ఎస్‌ఎఫ్‌టీ అని, ఆ తర్వాత 21.3 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి హాస్పిటల్ విస్తీర్ణాన్ని పెంచారు. బిల్డింగ్ ప్లానులో 3 నెలలకోసారి మార్పు చేస్తూ వచ్చారు. కట్టడం, కూల్చడమే పనిగా పెట్టుకుని.. నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ పోయారు.
హాస్పిటల్ ఏర్పాటుకు 2021లో,2022 జూన్ వరకూ పనులే మొదలు పెట్టలేదు. మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయేనాటికి 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
మాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా పలుమార్లు రివ్యూ చేశారనీ,మీరు అడ్డగోలుగా, అశాస్త్రీయంగా పెంచిన నిర్మాణ వ్యయాన్ని తగ్గించి రూ.300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
హాస్పిటల్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయించి, త్వరలో హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నాం.
మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నాం.ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
కేన్సర్ పేషెంట్లకు చికిత్స అందించే విధంగా అత్యాధునిక Linac, Radiology సేవల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
హిమోఫిలియా,సికిల్‌సెల్ ఎనిమియా,
తలసేమియా వంటి బ్లడ్ డిజార్డర్స్‌కు చికిత్స అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించబోతున్నాం.
ఓ వైపు అత్యాధునిక సేవలతో హాస్పిటల్‌ను ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధమవుతుంటే, మీరు ఎప్పటిలాగే ప్రచారం కోసం పాకులాడుతున్నారు.
ఇలాంటివి ఇకనైనా మానుకుని, ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందనీ మంత్రి దామోదర్ హితవు పలికారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.