ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపాలిటీ పీఠాన్ని బిజెపి సొంతం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైన విషయం తెలిసినదే. ఈ మేరకు బిజెపి కౌన్సిల్ బృందం శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోరారు. నారాయణపేటలో అత్యధిక బిజెపి కౌన్సిలర్ స్థానాలు బిజెపి సొంతమయ్యేలా కృషిచేసిన ఎంపీ డీకే అరుణకు మరో మారు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ ని కలిసిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్మన్ మంజుల రాఘవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కమలా పూర్ ప్రభాకర్, సత్య రఘుపాల్, అంబికా శ్రీనివాస్, కల్పనా రఘురామయ్య గౌడ్, సౌజన్య, ఎరుకలి రాఘవేంద్ర, నాయకులు చిన్న రఘు తదితరులు ఉన్నారు.