Take a fresh look at your lifestyle.

సంత్ సేవాలాల్ దేశం గర్వించే ఆధ్యాత్మికవేత్త

  •  సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో చేశారు
  •  టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య

సంగారెడ్డి, ముద్ర :సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని..ఆయన అడుగుజాడల్లో నడవాలని మెదక్–కరీంనగర్–నిజామాబాద్– ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య సూచించారు.శనివారం సంగారెడ్డి పట్టణంలోని గణేశ్ నగర్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో కొమరయ్య మాట్లాడుతూ..గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్..సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు.తన పాటలు, రచనలతో జనాలను జాగృతం చేయడానికి ఎన్నో ప్రబోధాలను బోధించారన్నారు.బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి సేవాలాల్ పునాదులు వేశారన్నారు.సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ ఆధ్మాత్మికవేత్త అని కొమరయ్య కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.