Take a fresh look at your lifestyle.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయండి -కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రానున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేఎయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు.రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో జరిగిన గోదావరి నది పుష్కరాల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. రాబోయే గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే సంబంధిత అధికారులు అందరితో, పుష్కరాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించినట్లు వివరించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లను చేయాలన్నారు. ప్రతి పుష్కర ఘాట్ వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఘాట్ ల నిర్మాణం, నీటి వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వసతులు కల్పిస్తామని తెలిపారు.డిపిఓ శ్రీనివాస్, నీటిపారుదల ఈఈ అనిల్, జెడ్పీ సీఈవో గోవింద్, ఈఈ ఆర్ డబ్ల్యుఎస్ సందీప్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.