- జెడి నారాయణరావు.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి :కల్వకుర్తి పురపాలికను పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ జెడి నారాయణరావు అన్నారు. గురువారం పట్టణంలో జరుగుతున్న వందరోజుల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వందరోజుల కార్యక్రమాన్ని చేపట్టిందని దీంతో ప్రతి కాలనీ పరిశుభ్రంగా తీర్చించడంతోపాటు సమస్యలు సత్వరమే పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రజల నుండి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని సెక్రిగేషన్ షెడ్డులో చెత్తను వేరు చేసి తిరిగి ఉపయోగించుకొని ఆదాయాన్ని పొందాలని అన్నారు.డంపింగ్ యార్డ్, ప్రధాన మరుగు కాలువలు, కాలనీలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట పుర కమిషనర్ మహమూద్ షేక్ , పర్యావరణ ఇంజనీర్ శివ సిబ్బంది పాల్గొన్నారు.