ముద్ర ప్రతినిధి జడ్చర్ల: డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు సేవలు మరువలేనివి అని ప్రిన్సిపాల్ సుకన్య అన్నారు. గురువారం ఉదయం బూర్గుల రామకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కలశాల ఆవరణలో ముండ్లచెట్లను తొలగించి చెత్త చెదారంను తొలగించారు. అనంతరం కలశాల ఆవరణలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుకన్య మాట్లాడుతూ,బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ కు తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, స్వతంత్ర్య ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చారని, పెద ప్రజలకు బూములను పంచి పెట్టారని అన్నారు. అలాగే నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించి, హైదరాబాద్ కు తొలి ముఖ్యమంత్రిగా నియామకమై 1952 నుంచి 1956 వరకు విశిష్ట సేవలు అందించి 1967 సెప్టెంబర్ 14 న గుండెపోటుతో మరణించారని అన్నారు . ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయన పెరుమీద డాక్టర్ బీ. ఆర్. ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను స్థాపించి,పెద విద్యార్థులకు విద్యను అందించి,ఉజ్వల భవిష్యత్తుకు బాటవేస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమాల్లో కలశాల వైస్ ప్రిన్సిపాల్ నర్మదా,శ్రీనివాసులు,అధ్యాపకులు రాఘవేంద్ర రెడ్డి,సదాశివయ్య, నందకిషోర్,మాధురి,సతీష్,నర్సింలు నరసింహ రావు,పుష్పాలత, వెంకటయ్య,నాగరాజు,నాగలక్ష్మీ, సులేమాన్ ,వెంకట్ రెడ్డి , వేణు,రుక్యాబాను , సూరయ జాబిన్ ,యన్. యస్ యస్ వాలంటీర్లు పాల్గొన్నారు.