. యైటింక్లయిన్ కాలని. ముద్ర: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకుల బదిలీలను నిపివేయాలని కోరుతూ, రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శనివారం సింగరేణి రామగుండం రెండవ ఏరియా అఫిషియేటింగ్ జీఎం నెహ్రూ కు వినతి పత్రం అందించారు. సాయంత్రం ఏరియా కార్యాలయానికి వచ్చిన ఆయన అఫిషియేటింగ్ జీఎం ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామ్మూర్తి, సీనియర్ నాయకులు బాలసాని కొంరయ్య, బదిలీలను వెంటనే ఉపసంహరించు కోవాల న్నారు. నిబంధనలకు విరుద్ధంగా 8 నెలలు, 13 నెలల సర్వీస్ ఉన్న ఆ ఇద్దరి కార్మికుల్ని బదిలీ చేయడం అంటే, ఇది రాజకీయ ఒత్తిడితో చేసిందని తెలుస్తోందన్నారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత చర్యలకు పూనుకుంటే పారిశ్రామిక శాంతికి భంగం వాటిల్లుతుందని అన్నారు. వెంటనే వారి అక్రమ బదిలీ నిలిపి వేయని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ బిఆర్ఎస్ పార్టీని, కలిసి వచ్చే సంఘాలను కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎమ్మెల్యే వెంట యూనియన్ ఏరియా ఉపాధ్యాక్షులు ఐలి శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, తిరుపతి, అనిల్ రెడ్డి, మల్లేశ్వరరావు, హరి ప్రసాద్, శ్రీనివాస్, కమలాకర్, రవి, శ్రీనివాస్, సదయ్య, రాజేశం, మధుకర్, మహేందర్, నరేందర్ లు ఉన్నారు.