Take a fresh look at your lifestyle.

సీనియర్ మహిళా కాంగ్రెస్ నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

 

  డిసిసి కార్యాలయం, కరీంనగర్

ఈరోజు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో డిసిసి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ప్రధానంగా బూతు స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతో పాటు 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ సీనియర్ మహిళా నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని మహిళా చర్చించడం జరిగింది.

సమావేశంలో భాగంగా కర్ర సత్యప్రసన్న రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని రాబోయే జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దశాబ్దాలుగా కష్ట పడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా మహిళా కాంగ్రెస్ లో కష్ట పడ్డ మహిళలకు అవకాశాలు దక్కే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ ,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య గారు ,రాష్ట మహిళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతి రెడ్డి నగర అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ,కరీంనగర్ జిల్లా మహిళా బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ,కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ మహిళా అధ్యక్షులు,తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.