Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్‌లో చికెన్ వ్యాపారాల బంద్ కొనసాగింపు – అధ్యక్షుడు సుభాష్, వ్యాపారుల విజ్ఞప్తి

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 1న చికెన్ వ్యాపారాలు ముకుమ్మడిగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్‌లో భాగంగా చికెన్ సెంటర్ నిర్వాహకులు తమ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా స్నేహ కంపెనీ మరియు విఎన్ఆర్ కంపెనీలు పూర్తి మద్దతు ప్రకటించడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. చికెన్ సెంటర్ నిర్వాహకులకు సరైన మార్జిన్ కల్పించే విధంగా ధరలపై స్పష్టమైన ప్రకటన (పేపర్) విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం చికెన్ సెంటర్ సొసైటీ తరఫున అందించిన మద్దతుకు సంబంధిత కంపెనీలకు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బంద్‌ను మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగించే యోచనలో ఉన్నట్లు సంఘం అధ్యక్షుడు సుభాష్, కార్యదర్శి జంగిర్, కోశాధికారి మరియు సభ్యులు తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కంపెనీలు, ఫార్మర్లు అందరూ కలిసి సరైన ధరను నిర్ణయించి అధికారికంగా ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లపై త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.