Take a fresh look at your lifestyle.

రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి

  • జనగామ శివాలయం అభివృద్ధికి 6 కోట్ల నిధులు ఇవ్వాలి.
  • సీఎం రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనీ,
  • ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో కలిసి వినతి పత్రం అందించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్.

ముద్ర ప్రతినిధి గోదావరిఖని: రామగుండం ప్రజల చిరకాల కోరిక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని,తద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు.ఈ విషయం తో పాటు పలు సమస్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో సీఎం రేవంత్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.గతంలో ప్రకటించిన మాదిరిగా రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని వినతిలో మంత్రి తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జన్ కో,ట్రాన్స్ కో లో పనిచేస్తున్న ఆర్టిజెన్సును గుర్తించాలని కోరారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్సును రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు.గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది పక్కనే జనగామ గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆరు కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు.ప్రాముఖ్యతను సంతరించుకున్న జనగామ శివాలయానికి నిధులు కేటాయిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ మారుపేర్ల బాధితుల కు సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.సింగరేణి వ్యాప్తంగా విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో వీరు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే వీరికి సంస్థలో అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను మంత్రి శ్రీధర్ బాబు తో వెళ్ళి కలిశారు.

Leave A Reply

Your email address will not be published.