ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగణన – 2027 మరియు స్వీయ గణనకు సంబంధించి అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రక్రియ అని తెలిపారు. ప్రతి కుటుంబం సరైన సమాచారం అందించి జనగణన స్వీయ గణన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీవో కృష్ణారెడ్డి , సీపీఓ కార్యాలయ సిబ్బంది, సెన్సస్ అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.