ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సవం నెలకొంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ తాండూర్ పట్టణ టీం ఆధ్వర్యంలో 1000 సంవత్సరాల సోమనాథ్ జ్యోతిర్లింగాల దర్శనం పూజ సత్సంగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వినాయక కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, ఆర్బిఎల్ ఎండి బు య్యని సరళ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సునీత సంపత్, విట్టల్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు హాజరై సోమనాథ్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.
