ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు.
శుక్రవారం తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ మొదటి, సంవత్సరం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రథమ సంవత్సరం లో 3936 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ద్వితీయ సంవత్సరంలో 1691మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 5627 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. అందుకు 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సురేష్, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ సంపూర్ణ,ఆర్టీసీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.