Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 25,313 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వీరి కోసం 20,022 సీట్లు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరై నిబంధనలు పాటించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.